దివ్యాంగులైన విద్యార్థులకు ఏసీపీ పుస్తకాల పంపిణీ

HNK: కాజీపేట మండల కేంద్రంలో మంగళవారం దివ్యాంగులైన 35 మంది విద్యార్థులకు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నోట్ పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. శ్రీ నాగ సాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు చంద్రమోహన్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.