బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VSP: తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పలువురు కుటుంబాలకు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. 35వ వార్డులోని గాజుల వీధి వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని అబ్దుల్ సమద్ ఖాన్, ఫైజూర్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు.