టీడీపీకి షాక్.. వైసీపీలోకి చేరికలు
KRNL: హాలహర్వి మండలం బాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పలువురు ఇవాళ వైసీపీలో చేరారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. టీడీపీలో విసుగు చెంది వైసీపీలో చేరామని తెలిపారు. వైసీపీలో చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.