VIDEO: వర్షం భయం.. ముమ్మరంగా వరి కోతలు
SRPT: మోతే మండలంలో వరి కోత పనులు వేగంగా సాగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉండటంతో, పంట నష్టం కాకుండా రైతులు అప్రమత్తమయ్యారు. యంత్రాల సహాయంతో త్వరితగతిన కోతలు పూర్తి చేస్తూ, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు.