VIDEO: నాగేంద్రను అరెస్టు చేయాలి: దళిత జేఏసీ
అన్నమయ్య: రైల్వే కోడూరులో దళిత మహిళా ఉద్యోగిపై నడిరోడ్డుపై జరిగిన దాడి ఘటనలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాత్ర ఉందని ఆరోపిస్తూ దళిత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు మాట్లాడుతూ.. నాగేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.