గుర్లలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన
VZM: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో గుర్ల ఎస్సై పి.నారాయణరావు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలలో ఐక్యతతో మెలగాలని కోరారు. చదువు పట్ల దృష్టి సారించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హితవు పలికారు. సైబర్ మోసగాళ్లతో పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.