తమిళ పాలిటిక్స్‌లో బీజేపీ భారీ స్కెచ్!

తమిళ పాలిటిక్స్‌లో బీజేపీ భారీ స్కెచ్!

తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-టీవీకే మధ్య పొత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 సీట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ మాత్రం సీఎం కుర్చీపైనే దృష్టి పెట్టారని సమాచారం. గతంలో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆయన ప్రకటించినా, తాజా ప్రచారం తమిళ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది.