VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
MDK: కౌడిపల్లిలో హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెల్దుర్తి మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందించి, అతన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.