సారా రహిత గ్రామాలు గుర్తింపు: ఎక్సైజ్ ఎస్సై

VZM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని 16 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా నిర్ధారించామని ఎక్సైజ్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం స్దానిక MPDO కార్యాలయంలో MPP దీనమయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలలో నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరించి, ప్రజలలో మార్పు తీసుకురావడం ద్వారా సారాను పూర్తిగా అరికట్టామన్నారు.