కొత్తవలస మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు
VZM: ఎస్ కోటా నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలో 27, 28 వ తేదీ సాయంత్రం 8 గంటల సమయానికి అత్యధికంగా 102.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. అలాగే జామి మండలంలో 56.6, ఎల్ కోటలో 52.0, ఎస్ కోట మండలంలో 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వేపాడ మండలంలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.