రాయితీతో రైతులకు పరికరాలు పంపిణీ

ATP: శింగనమల నియోజకవర్గంలో ప్రభుత్వ రాయితీపై డ్రిప్, స్పింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 100% రాయితీతో వ్యవసాయ పరికరాలు, తుంపెర సేద్య పరికరాలు అందజేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు.