'మా గ్రామాలను ఆదోనిలోనే ఉంచాలి'

'మా గ్రామాలను ఆదోనిలోనే ఉంచాలి'

కర్నూలు: తమ గ్రామాలను పెద్దహరివాణం మండలంలో చేర్చొద్దని చిన్న హరివాణం గ్రామస్థులు కాలువ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులతో పాటు 16 గ్రామాల ప్రజలు, సర్పంచులు, ప్రతినిధులు, యువకులు ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ ఆదోని సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త మండలం ఏర్పాటు చేసినా.. తమ గ్రామాలను ఆదోనిలోనే ఉంచాలన్నారు.