ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోండి: నాదెండ్ల
GNTR: తెనాలి పురపాలక సంఘ మెప్మా విభాగం ఆధ్వర్యంలో మహిళా మండలి భవనంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గ పరిధిలోని మహిళలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని నాదెండ్ల సూచించారు.