ఉద్యోగుల కోసం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్
NLG: నల్గొండ మండలంలో పంచాయతీ ఎన్నికల విధులకు వెయ్యి మంది సిబ్బందిని కేటాయించారు. ఈ ఉద్యోగులు ఓటు వేయడానికి ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో యాకూబ్ నాయక్ తెలిపారు. మండలంలోని 31 గ్రామాల్లో 39 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా, 270 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.