'ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు'
AKP: యుపీఎస్సీ సివిల్స్‌కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకు సిద్ధం అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు డిసెంబర్ 3 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వివరాలతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డు జత చేయాలన్నారు.