ఈ నెల 3వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ఈ నెల 3వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10 : 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీ-కోసం' కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదు అభ్యర్థనలు సమర్పించవచ్చని చెప్పారు. అనంతరం జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.