అర్జీలు స్వీకరించిన కలెక్టర్
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీ దారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్‌వో కె.మోహన్ కుమార్ పాల్గొన్నారు.