'రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు'
SS: అమరావతి రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.