రావిపాడులో పేకాట స్థావరంపై దాడి

రావిపాడులో పేకాట స్థావరంపై దాడి

PLD: నరసరావుపేట రూరల్ పరిధిలోని రావిపాడులో పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ వద్ద ఉన్న ఇళ్లలో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 8 మంది పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదును సీజ్ చేశారు.