వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడా మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం వంటి పూజలు యథావిధిగా జరిపారు.