రౌడీ షీటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పోలీసులు

WGL: వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు రౌడీ షీటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రౌడీషీటర్లను వరుసగా అరెస్ట్ చేస్తుండటంతో మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని 57 మంది రౌడీషీటర్లు భయం గుప్పిట్లో బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారం రోజుల్లో సురేశ్, ఇంతియాజ్, వంశి తదితర రౌడీషీటర్ల అరెస్ట్‌తో మిగతా వారు భయపడుతున్నారు.