లక్ష గాజులతో కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణ

WGL: శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీవాసవిమాత దేవాలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహా హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.