ఎమ్మెల్యే ను కలిసిన సచివాలయం ఉద్యోగులు

CTR: మదనపల్లి నియోజకవర్గంలోని సచివాలయం డిజిటల్ సహాయక ఉద్యోగులు శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. డిజిటల్ సహాయకులు తమ సమస్యలను MLAకు విన్నవించారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగిన డిజిటల్ సహాయకులు వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌లుగా నియమించాలని విన్నవించారు. MLA సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.