VIDEO: మేడారంలో జంపన్నవాగులో జలకళ
MLUG: లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో బుధవారం మేడారం జంపన్నవాగు పూర్తిస్థాయిలో నిండుకుంది. వాగులో జలకళ సంతరించుకోవడంతో భక్తులు ఆనందోత్సాహాలకు లోనవుతున్నారు. ఇదే సమయంలో ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాగు పరిధిలో ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పటిష్టం చేశారు.