100 పడకలతో ESI హాస్పిటల్ నిర్మాణం
నెల్లూరు నగరంలో 100 పడకలతో ESI హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. టెండర్ ప్రక్రియ ప్రారంభంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు, నిర్మాణానికి సంబంధించిన వివరాలను కోరారు.