చౌడాపూర్ మండలంలో 6 గ్రామాలు ఏకగ్రీవం
VKB: జిల్లాలో మూడో విడత స్థానిక ఎన్నికలు ముగిశాయి. బుధవారం చౌడాపూర్ మండలంలో 18 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా 6 గ్రామపంచాయతీలు ముందస్తుగానే ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నిక కాబడ్డారు. వాల్యనాయక్ తాండలో నరసింహ నాయక్, కొత్తపల్లిలో రజిత, మక్తావెంకటాపూర్‌లో కవిత, కిష్టంపల్లిలో రాధిక, లింగన్నపల్లిలో నారాయణ, నీర్నాబ్ తండాలో కిష్టమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.