జార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
జార్ఖండ్‌లోని సువర్ణరేఖ నదీ తీరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ బాంబు బయటపడటం కలకలం రేపింది. అమెరికా తయారీగా భావిస్తున్న ఈ బాంబు గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉంది. దీని పరిమాణం, శక్తిని బట్టి నిర్వీర్యం చేయడం తమవల్ల కాదని బాంబ్ స్క్వాడ్ స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఇండియన్ ఆర్మీ సాయం కోరారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని భారీ భద్రత ఏర్పాటు చేశారు.