అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

NGKL: వెల్దండ మండలంలోని రాచూరు గ్రామానికి చెందిన కొంగళ్ళ శివకుమార్ (25) అనే యువకుడు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద అతడి మృతదేహం పడి ఉంది. 18 నెలల క్రితమే వివాహమైన శివకుమార్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్న ఒక్క కొడుకు అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.