'శాంతి భద్రతల దృష్ట్య మద్యం దుకాణాలు బంద్'
JN: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల దృష్ట్యా మద్యం దుకాణాల తాత్కాలిక మూసివేతకు కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మూడు విడతల్లో మండలాల వారిగా మూసివేత అమలు కానుందని స్పష్టం చేశారు. నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.