'మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి'
KRNL: క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ నేత అమ్లివాలే ఫయాజ్ డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. గతంలో వివక్ష కారణంగానే దళితులు మతం మారారని, వారిని ఎస్సీలుగా గుర్తించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.