VIDEO: వైభవంగా చక్రతీర్థ కార్యక్రమం

VIDEO: వైభవంగా చక్రతీర్థ కార్యక్రమం

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ చక్రతీర్థం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను, సుదర్శన చక్రాన్ని ఆలయ కోనేరు వద్దకు తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.