పెట్రోల్ కొరతపై వదంతులు నమ్మొద్దు: బండి సంజయ్

పెట్రోల్ కొరతపై వదంతులు నమ్మొద్దు: బండి సంజయ్

KNR: పెట్రోల్ కొరతపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని, ఆయిల్‌ సంస్థల వద్ద అవసరానికి సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలున్నాయని అసోసియేషన్‌ స్పష్టం చేసిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ సరఫరా కొనసాగుతోందని ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.