పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్సై
ప్రకాశం: హనుమంతునిపాడు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎస్సై మాధవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.