ఇరుగుళంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
TPT: సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని YCP సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ శేఖర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అంబేద్కర్ భారతీయులందరికీ రాజ్యాంగం అందించిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.