ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

NGKL: కోడేరు మండలంలోని మైలారానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం నుంచి జులై 29న హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.