అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు స్వాధీనం..

అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు స్వాధీనం..

MLG: వెంకటాపురం మండలం కొత్తగుంపు బీట్ అటవీ ప్రాంతం నుంచి టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి 17 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు పారిపోయినట్లు ఫారెస్ట్ అధికారి జై సింగ్ తెలిపారు. ఇట్టి కలప విలువ 4లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.