బీజేపీ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు ఘన సత్కారం

కోనసీమ: అమలాపురం పట్టణం స్థానిక సూర్య నగర్‌లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రాఖీ పండుగ సందర్భంగా మాజీ సైనికులకు రాఖీలు కట్టి, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ కిసాన్ మోర్చా నేత నల్లా పవన్ పాల్గొని మాజీ సైనికులకు శాలువాలతో సత్కారం చేశారు.