నిరుపయోగంగా 13 కోట్ల జన్‌ధన్ ఖాతాలు

నిరుపయోగంగా 13 కోట్ల జన్‌ధన్ ఖాతాలు

13 కోట్లకు పైగా జనధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. మొత్తం 56.04 కోట్ల ఖాతాల్లో 23 శాతం నిరుపయోగంగా ఉన్నాయన్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ ఖాతాలను పునరుద్ధరించేందుకు.. సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం RE-KYC ప్రచారాన్ని చేపడుతోందని పేర్కొన్నారు.