సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని నిరసన

SRD: సంగారెడ్డి పట్టణం మాధవ్ నగర్ లో ఏర్పాటు చేయవద్దని కోరుతూ మహిళలు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం సరికాదని మహిళలు తెలిపారు. అధికారులు స్పందించకుంటే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. సెల్ టవర్ వల్ల గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.