వరంగల్ మార్కెట్‌లో పడిపోయిన పత్తి ధర

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం శుక్రవారం ప్రారంభమైంది. దీంతో మార్కెట్‌కు పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ధర పడిపోయింది. గతవారం క్వింటా పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలకగా.. నేడు రూ.6, 975 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. ధర తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.