నలుగురు విద్యార్థులు డీబార్

KNR: కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2లో నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 15,965 మంది విద్యార్థులకు గాను 15,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 402 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.