GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
AP: డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం 'స్త్రీనిధి' రుణ పరిమితిని పెంచింది. సాధారణ మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న లక్షకు అదనంగా మరో రూ.2 లక్షలు, SC, ST మహిళలకు రూ.4 లక్షల వరకు రుణం అందించనుంది. సకాలంలో లోన్ చెల్లించే వారికి ప్రాధాన్యత ఉంటుంది. రేపటి నుంచి సెర్ప్ అధికారులు గ్రామ సంఘాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, వ్యాపార ఆసక్తి గల మహిళలను ఎంపిక చేస్తారు.