రీ సర్వే పనులు పరిశీలించిన జేసీ

ప్రకాశం: తాళ్లూరు మండలంలోని బెల్లం కొండవారిపాలెం గ్రామ వద్ద జరుగుతున్న రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శుక్రవారం పరిశీలించారు. రికార్డుల్లో వున్న గ్రామ విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమిసరిపోయిందా ? లేదా ? అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే జరపాలని, ముందుగా ప్రభుత్వ భూములను కొలిచి తదుపరి పట్టా భూములను కొలవాలని ఆదేశించారు.