SIకి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు

KDP: పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లిలో వర్షాలతో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన SI మధుసూదన్ రెడ్డి జేసీబీ సహాయంతో రోడ్డును శుభ్రం చేయించారు. ముళ్లపొదలు, మట్టి తొలగించి రాకపోకలకు వీలుగా మార్గం రూపొందించారు. గ్రామస్థులు మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.