'స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'
కోనసీమ: ప్రమాదకరమైన స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి M.దుర్గారావు దొర సూచించారు. ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నల్లిని పోలి ఉండే కీటకం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గత 11 నెలల్లో 177 మందిని పరీక్షించగా 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు.