ఉపాధి హామీ పనులపై గ్రామసభ

ఉపాధి హామీ పనులపై గ్రామసభ

VZM: ఎస్.కోట మండలం తిమిడిలో సర్పంచ్ వబ్బిన త్రినాథమ్మ అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు తదితర పనులకు ఆమోదం తెలిపారు. ఇందులో పంచాయితీ కార్యదర్శి చంద్రమోహన్, వీఆర్వో రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.