కాలిన గాయలతో వ్యక్తి అనుమానాస్పద మృతి

KRNL: మద్దికేర మండలం అగ్రహారం గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్వక్తి కాలిన గాయలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విజయ నాయక్ సంఘటన స్థాలనికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.