యాడికిలో చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

ATP: యాడికి మండల కేంద్రంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు శ్రావణమాస పూజలు చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.