రోడ్డు ప్రమాదం.. మాజీ జెడ్పీటీసీ భర్తకు గాయాలు

MBNR: కేఎల్ఐ కాలువ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ జెడ్పీటీసీ శశిరేఖ భర్త బాలు జడ్చర్ల నుంచి మిడ్జిల్ వస్తుండగా కేఎల్ఐ కాలువ వద్ద కల్వకుర్తి నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టడంతో కల్వర్టును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కార్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పి గాయాలతో బయటపడ్డారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.