కేసముద్రం మార్కెట్‌ను సందర్శించిన హరీష్ రావు

కేసముద్రం మార్కెట్‌ను సందర్శించిన హరీష్ రావు

MHBD: కేసముద్రం మండలంలోని వ్యవసాయ మార్కెట్‌ను ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి సందర్శించారు. పత్తి రైతులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతులకు ఎల్లవేళలా BRS అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.